ఖైరతాబాద్, జూలై 16: జోగినీలు, శివసత్తులపై దాడులు చేసిన చరిత్ర ఈ దేశంలోనే లేదని, కానీ బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో తమపై జరిగిందని జోగినీ శ్యామల ఆవేదన వ్యక్తంచేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరుపుకొనే బోనాల ఉత్సవాల్లో ఏటా తాము ఆనవాయితీగా పాల్గొంటున్నామని చెప్పారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో పోలీసుల లాఠీచార్జి కారణంగా అమ్మవారికి సరైన నైవేద్యం అందలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఏ ప్రభుత్వ హయాంలో నూ జోగినీ, శివసత్తులు, పోతురాజులపై లాఠీచార్జీలు జరుగలేదని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అమ్మవారిని దూరం చేశారని మండిపడ్డారు.
ఓ వైపు అమ్మవారి కల్యాణం జరుగుతుండగానే మంత్రి కొండా సురేఖ రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు కృతజ్ఞతలు తెలుపాలని అడగడంపై ఈ వేడుకలపై వారికి అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభు త్వ హయాంలో బోనాల వేడుకలకు జాతీ య, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం లభించిందని గుర్తుచేశారు. దాడిపై ఫిర్యా దు చేసి వారం రోజులైనా ఇంతవరకు సమాధానం రాలేదని, ప్రభు త్వం ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమపై జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ ఈ ఏడాది ఉజ్జయినీ మహాంకాళి దేవాలయానికి బోనాలు తీసుకువెళ్లడంలేదని ప్రకటించారు. ఆ తర్వాత జరిగే అరిష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన ఆగదని హెచ్చరించారు.