హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీ రత్నాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి పీ సదానందం తెలిపారు. ప్రమాదంలో మరణించిన డీఈ శ్రీనివాస్ కుటుంబానికి రూ.1.25 కోట్లు, ఇతర ఉద్యోగులకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించామని తెలిపారు. మృతులుబీ శ్రీనివాస్, సుందర్, మోహన్, వెంకట్రావు, రాంబాబు, కిరణ్ కుటుంబసభ్యులు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారని, ఫాతిమా కుటుంబసభ్యులు మాత్రం ఉద్యోగానికి దరఖాస్తు చేయలేదని వివరించారు.