హనుమకొండ చౌరస్తా, జూలై 2 : ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. పోలీస్‌శాఖలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని హనుమకొండలో గురువారం ర్యాలీ తీసి, అంబేదర్ విగ్రహం వద్ద బైఠాయించారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు 36, ఎస్సైకి 38 సంవత్సరాలు వయోపరిమితి ఇవ్వాలని ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేశ్ కోరారు.
వెంటనే నోటిఫికేషన్ ఇవ్వకపోతే మంత్రుల ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.