ఖైరతాబాద్, జనవరి 24: ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంపు తర్వాతే రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి వచ్చాక నియామకాల్లో పారదర్శకత లోపించిందని, ఆయన సామాజికవర్గ తత్వమే కనిపిస్తున్నదని ధ్వజమెత్తారు. చట్టసభల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు ప్రాతినిధ్యం తగ్గేలా కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. సామాజిక పింఛన్లను డిసెంబర్ నుంచే పెంచి ఇవ్వాలని కోరారు.