హైదరాబాద్, డిసెంబర్ 3( నమస్తే తెలంగాణ): ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భరీ ్తచేస్తాం… జాబ్ క్యాలండర్‌ను విడుదల చేస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను దారుణంగా వంచించిందని విమర్శలు ఎదుర్కొంటున్నది. రెండు లక్షల ఉద్యోగాలు అంటూ ఆశచూపిన కాంగ్రెస్ సర్కారు ఏడాదిలో భర్తీ చేసింది కేవలం ఆరువేల లోపు ఉద్యోగాను మాతమ్రే. కేసీఆర్ సర్కారు హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటూ గొప్పలు చెప్పకుంటున్నదని గులాబీ నేతలు మండిపడుతున్నారు.
గోరంత పనికి.. కొండంత గొప్పలు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం సంబురాలు నిర్వహిస్తున్నది. ఏడాది పాలనలో 54, 520 ఉద్యోగాలు భరీ ్తచేసినట్టు ప్రకటించింది. వీటిలో కొన్ని కారుణ్యనియామకాలు ఉన్నాయి. వీటిలో 50వేల ఉద్యోగాలకు గత బీఆర్ఎస్ సర్కారే నోటిఫికేషన్లు జారీచేసింది. కాంగ్రెస్ సర్కారు కొత్తగా 12,527 ఉద్యోగాల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇందులో కూడా 5,973 మంది టీచర్లను భరీ ్తచేసింది.
కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు
కాంగ్రెస్ సర్కారు భర్తీ చేసినట్టు చెప్పుకుంటున్న నోటిఫికేషన్లు 2022, 2023లో వచ్చినవే. వీటిలో గ్రూప్-4 సహా పలు పరీక్షలను బీఆర్ఎస్ సర్కారు హాయంలోనే నిర్వహించారు. పరీక్షలు కూడా గత ప్రభుత్వమే నిర్వహించింది. కేవలం ఫలితాలు విడుదల చేసి 8వేలకు పైగా ఉద్యోగాలను తామే భర్తీ చేశామని చెప్పుకుంటున్నది. ఈ మేరకు ఇవాళ పెద్దపల్లిలో నియామకపత్రాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లలో కొన్ని ఉద్యోగాల భర్తీకి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో వాటికి ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు నియామకపత్రాలిచ్చి గొప్పలు చెప్పుకుంటున్నది.