హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఈ నెల 6 నుంచి 14 వరకు అప్రెంటీస్ కమ్ జాబ్ మేళాలను నిర్వహించనున్నట్టు ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. స్కిల్ ఇండియా మిషన్, నేషనల్ అప్రెంటీస్షిప్ ప్రమోషన్ స్కీమ్ కింద మేళాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
గత మూడు విద్యాసంవత్సరాల్లో ఇంటర్ ఉత్తీర్ణలైన విద్యార్థులు ఈ మేళాకు హాజరుకావొచ్చని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.9,600 ైస్టెఫండ్గా అందిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని ఐదు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ మేళాలు జరుగుతాయని తెలిపారు.