సిద్దిపేట : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి ( Jeevan Reddy ) ఈనెల 20న బీఆర్ఎస్( BRS ) అధినేత కేసీఆర్ ( KCR ) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్ ( Koppula Eshwar ) , ఎల్ రమణ ( L Ramana ) వెల్లడించారు. ఎర్రవల్లి లోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి భేటీ అనంతరం వారు మీడియా తో మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్లీనరీ సభకు ముందే జగిత్యాలలో నిర్వహించే భారీ బహిరంగ సభలో భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో రైతు సమస్యలతో ప్రజా సమస్యలపై బహిరంగ సభ నిర్వహించబోతున్నామని వెల్లడించారు. కేసీఆర్ తో కలిసి పని చేయడానికి జీవన్ రెడ్డి ముందుకు రావడం సంతోషమని వివరించారు. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారని, ప్రజా సమస్యలపై ఇకపై నిరంతరం పోరాటం చేస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని స్పష్టం చేశారు.