జగిత్యాల, మార్చి 25(నమస్తే తెలంగాణ): ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి ఆ పార్టీని వీ డారు. యాభై ఏండ్లుగా రాజకీయాలతో పెనవేసుకుపోయిన ఆయన, చివరకు సొంత పార్టీ నాయకులు ఆడుతున్న కుటిల ఆటకు బలై, పార్టీ నుంచి నిష్క్రమించారు. శాసనమండలిలో కాంగ్రెస్ తరఫున ఒక్కరే అయినా జీవన్‌రెడ్డి ధాటికి తాము తట్టుకోలేకపోతున్నామ ని, ఆయన కాంగ్రెస్‌లో నే అరుదైన నాయకుడం టూ అప్పటి మంత్రి కేటీఆ ర్ వ్యాఖ్యానించడం విశేషం. అ లాంటి జీవన్‌రెడ్డి నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్గీయుల నుంచి ఎదురవుతున్న అవమానాలను భరించలేక ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. జీవన్‌రెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని పోగొట్టుకోవడం కాంగ్రెస్‌కు తీవ్ర నష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉస్మానియా యునివర్సిటీ లా కాలేజీలో న్యాయశాస్త్రం అధ్యయనం చేసిన జీవన్‌రెడ్డి 1977-78 ప్రాంతంలో జగిత్యాలలో న్యాయవాద వృత్తి చేపట్టారు. ఆ రోజుల్లోనే పౌరహక్కుల సంఘం నేతగా చురుగ్గా పనిచేశారు. జ గిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో రైతుకూలీ సంఘం నాయకుల తరఫున కేసులు వాదించారు. కోరుట్ల సమీపంలో జరిగిన ఇద్దరి ఎన్కౌంటర్ విషయంలో జాతీయ పౌరహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడమే గాక అప్పటి పౌరహక్కుల సంఘం జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను కోరుట్ల, జగిత్యాలకు ర ప్పించి, నిజనిర్ధారణ చేయించడం లో కీలక భూమిక పోషించారు. పౌర హక్కుల సంఘంలో చురుగ్గా పనిచేస్తూనే 1981లో మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షుడిగా స్వ తంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందా రు. 1982లో ఎన్టీఆర్ స్వయంగా పిలిచి టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1984 ఆగస్టు సం క్షోభ సమయంలో మంత్రి పదవికి రాజీనా మా చేసి నాదెండ్ల భాస్కర్‌రావుకు మద్దతు ప లికారు. అప్పట్లో నాదెండ్ల వ్యవహారంలో సైతం జీవన్‌రెడ్డి కీలక వ్యక్తిగా పేరొందారు.
జీవన్‌రెడ్డి దాదాపు 42 ఏండ్ల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. 1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం జీవన్‌రెడ్డి ఆ పార్టీలో చేరారు. అ ప్పటినుంచి గెలుపోటములు ఎన్ని వచ్చినా, ని బద్ధత కలిగిన కాంగ్రెస్‌వాదిగా పార్టీ ఆదేశాలను కొనసాగిస్తూ వచ్చారు. 2006, 2008లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో అప్పటి కరీంనగర్ ఎంపీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లారు. కేసీఆర్‌పై పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం జీవన్‌రెడ్డిని ఆదేశించగా, పోటీ చేయడం ఇష్టం లేకపోయినా, పార్టీ ఆదేశాల నేపథ్యంలో రెండు సార్లు పోటీ చేసి ఓటమిని మూటగట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌పై పోటీ ఇష్టం లేదని, అయినా పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే పోటీ చేశానని ఆ యన వ్యాఖ్యానించారు.
నలభై ఐదేండ్ల జీవన్‌రెడ్డి రాజకీయ ప్రస్థా నం అనేక సంచలనాలకు నెలవుగా మారింది. నియోజకవర్గ అభివృద్ధితోపాటు ఇతర సామాజిక అంశాలపై తనదైన ముద్రవేశారు. నక్సలిజాన్ని శాంతిభద్రతల సమస్యగా కాకుండా సా మాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యల కోణంలో చూడాలని, నక్సలైట్లతో చర్చలు జరుపాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేసిన ఏకైక ఎమ్మె ల్యే జీవన్‌రెడ్డే. తుమ్మిడిహట్టి మొదలు కాళేశ్వరం ప్రాజెక్టు వరకు అన్ని అంశాలపై జీవన్‌రెడ్డికి పట్టు ఉన్నది. అభివృద్ధి విషయంలో జీవన్‌రెడ్డి జగిత్యాలపై చెరగని ముద్ర వేశారనే చె ప్పాలి. 2007లో రోడ్లు భవనాల శాఖ మంత్రి గా ఉన్న సమయంలో పంట రుణాలు చెల్లించిన రైతులకు రూ.5వేల బోనస్‌ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, కొన్ని బ్యాంకులు 5వేల రాయితీని రైతులకు ఇచ్చేందుకు సతాయించాయి. ఈ నేపథ్యంలో మంత్రిగా ఉన్న జీవన్‌రెడ్డి జగిత్యాల పట్టణ కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ముందు రైతులతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడం అప్పట్లో సంచలనం సృష్టించింది. 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అప్పటి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి, బోర్నపెల్లి చిన్నబెల్లాల వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. విద్య, వైద్యం, రోడ్లు, వ్యవసాయ రంగాలపై ఆయన జిల్లా స్థాయిలో చెరగని ముద్రవేశారు.
జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ను విడిచిపెట్టడం ఆ పార్టీకి తీవ్ర నష్టం చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాస్ లీడర్‌గా గుర్తింపు పొందిన జీవన్‌రెడ్డికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మంచి పరిచయాలున్నాయి. రెడ్డి సామాజిక వర్గంతోపాటు బీసీ, ఎస్సీ, ముఖ్యంగా మైనారిటీ వర్గాల్లో జీవన్‌రెడ్డికి ఉన్న పతార ఉమ్మడి జిల్లాలో మరే నాయకుడికి లేదని చెప్తుంటారు. ప్రతి సబ్జెక్ట్‌పైనా జీవన్‌రెడ్డికి అవగాహన ఉన్నది. ఉమ్మడి కరీంనగర్‌తోపాటు ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఆయన అనుచరవర్గం ఉన్నది. తెలుగు, ఉర్దు, ఇంగ్లిష్ భాషలో స్పష్టమైన ఉచ్ఛారణ ఉండటం, ఎవరినైనా ప్రశ్నించే తత్వం ఉండటం, అవినీతి మరకలు లేని వ్యక్తిగా పేరుండటం వల్ల జీవన్‌రెడ్డి ఉత్తర తెలంగాణలోనే అరుదైన నాయకుడిగా గుర్తింపు పొందారు. అలాంటి నాయకుడు పార్టీని వీడటం వల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బతగులుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.