Pooja Hegde | ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా అగ్రహీరోల సరసన వరుస అవకాశాలు అందుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం కెరీర్లో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటోంది. భారీ చిత్రాల్లో నటించినప్పటికీ వరుస పరాజయాలు ఆమె జోరుకు బ్రేక్ వేశాయి. దీంతో ఒకప్పుడు నిర్మాతల ఫస్ట్ ఛాయిస్‌గా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు కొత్త అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూజా హెగ్డే నటించిన సినిమాల్లో ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ వంటి భారీ అంచనాల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. తాజాగా విడుదలైన ‘జన నాయగన్’ కూడా అంచనాలకు తగ్గట్టుగా వసూళ్లు సాధించలేకపోవడంతో పూజా ఖాతాలో మరో ఫ్టాప్ చేరినట్లైంది. వరుసగా వచ్చిన ఈ పరాజయాలు ఆమె మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం, భారీ పారితోషికం డిమాండ్ చేయడం కూడా నిర్మాతలను ఆలోచనలో పడేస్తోందని టాక్. మరోవైపు ఇటీవల ఆమె నటించిన కొన్ని చిత్రాల్లో పాత్ర నిడివి తగ్గిపోవడం, ఎడిటింగ్ సమయంలో కీలక సన్నివేశాలు తొలగించబడటం కూడా చర్చనీయాంశమైంది. దీంతో ముఖ్యంగా తెలుగులో కొత్త అవకాశాలు ఆశించిన స్థాయిలో రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమాల్లో సక్సెస్ లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం పూజా హెగ్డే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇన్స్టాగ్రామ్ సహా ఇతర సోషల్ మీడియా వేదికల్లో ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఫోటోషూట్లు, బ్రాండ్ ప్రమోషన్లు, ఎండార్స్మెంట్ల ద్వారా ఆమె ఇప్పటికీ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ బ్రాండ్లకు ఆమె ఇప్పటికీ ప్రాధాన్యమైన సెలబ్రిటీగా కొనసాగుతున్నారు.
ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో పెద్ద ప్రాజెక్టులు లేకపోయినా, మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆగస్టులో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టాలీవుడ్లో ఒకప్పుడు గోల్డెన్ లెగ్ హీరోయిన్గా గుర్తింపు పొందిన పూజా హెగ్డే ఇప్పుడు తప్పనిసరిగా ఒక బ్లాక్‌బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. రవితేజ సినిమా ఖరారైతే అది ఆమె కెరీర్‌కు కీలక మలుపుగా మారే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. వరుస పరాజయాల తర్వాత మళ్లీ విజయాల బాట పట్టి స్టార్ హీరోయిన్గా తన స్థానాన్ని తిరిగి సంపాదిస్తుందా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.