లక్ష్మీదేవిపల్లి, జూలై 24 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో బీఆర్ఎస్ నాయకుడు కొట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, నాయకులు ఎదురుగడ్డ సురేష్, మైనార్టీ అధ్యక్షుడు ఇక్బాల్ పాషా, మాజీ సర్పంచ్ తాడూరి రజాక్, ప్రశాంతినగర్ ఉప సర్పంచ్ ఎర్రబడి శ్రీను, వార్డు మెంబర్ శ్రీకాంత్ నాయక్, ఇంకా బీఆర్ఎస్ నాయకులు చిన్న, చిర్ర వెంకన్న, బద్రు, లాల్తాండ శ్రీను, మాజీ సర్పంచ్ రవి, గడ్డిగుట్ట వెంకటేష్, రాంజీ, తరాల దాము, వెలిశాల వినోద్, ఇమ్మంది గణేష్, బోసు శివ, దంతాల గణేష్, కల్లు గడ్డ శ్రీను, చిన్న నాయక్ మైలారం సంతోష్, జరుపుల బాలు పాల్గొన్నారు.