Doctors Drown | చెరువులో పడిపోయిన మొబైల్‌ను తీసేందుకు ప్రయత్నిస్తూ ఇద్దరు డాక్టర్లు మృతి
Doctors Drown | ముగ్గురు యువ డాక్టర్లు ఒక సరస్సు వద్ద పార్టీ చేసుకున్నారు. ఒకరి మొబైల్ ఫోన్ నీటిలో పడింది. దానిని తీసేందుకు ప్రయత్నించే క్రమంలో ఇద్దరు జూనియర్ వైద్యులు సరస్సులో మునిగి మరణించారు.
రాంచి: ముగ్గురు యువ డాక్టర్లు ఒక చెరువు వద్ద పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో ఒకరి మొబైల్ ఫోన్ నీటిలో పడిపోయింది. దానిని తీసేందుకు ప్రయత్నిస్తూ నీటిలో మునిగిపోయి ఇద్దరు జూనియర్ డాక్టర్లు మరణించారు. (Doctors Drown) జార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ఈ విషాద సంఘటన జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంజీఎం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన ముగ్గురు జూనియర్ డాక్టర్లు, జంషెడ్‌పూర్‌లోని దిమ్నా సరస్సుకు విహారయాత్రకు వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదకర ఆ ప్రాంతంలో వారు పార్టీ చేసుకున్నారు.
కాగా, ఒక వైద్యుడి మొబైల్ ఫోన్ ప్రమాదవశాత్తు సరస్సు తూము గేట్ల వద్ద నీటిలో పడింది. దీంతో దాని కోసం ఆ డాక్టర్ ఆ సరస్సులో దిగాడు. అతడు మునిగిపోతుండగా మిగతా ఇద్దరు డాక్టర్లు కాపాడేందుకు ప్రయత్నించారు. సరస్సు చాలా లోతుగా ఉండటంతో ముగ్గురు డాక్టర్లు మునిగిపోసాగారు.
అయితే ఈత వచ్చిన డాక్టర్ యష్ మాత్రమే ఆ నీటి నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఆయన సహచరులైన డాక్టర్ సమీర్, డాక్టర్ సాక్షమ్ నీటిలో మునిగిపోయారు. సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న వెంటనే డాక్టర్ యష్ తన సహచరులు, పోలీసులకు దీని గురించి సమాచారం ఇచ్చాడు.
మరోవైపు పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో ఆ సరస్సులో గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు గంటలకు పైగా గాలించిన తర్వాత ఇద్దరు డాక్టర్ల మృతదేహాలను వెలికితీశారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

