లక్ష్మీదేవిపల్లి, జూలై 24 : తెలంగాణా రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు విద్వాన్ డా కొచ్చర్ల సురేశ్ కుమార్ ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రాజ్యంగ సదన్‌లో పాల్గొన్నారు. భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అలాగే బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అధికారిక ధృవపత్రాన్ని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే, ఇతర ప్రముఖలు, అధికారులు, ప్రతినిధుల సమక్షంలో అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అధికారిక గుర్తింపు పొందిన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఇతర ప్రముఖల సమక్షంలో సింగరేణి ఇల్లెందు గెస్ట్ హౌస్ ప్రాంగణంలో సురేశ్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు.