తొగుట: భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలకు రాజ్యాంగమే బలమని, ప్రతి వ్యక్తికి సమాన హక్కులు కల్పిస్తూ జాతీయ ఐక్యత సమగ్రతకు పెద్దపీట సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని వెంకట్రావుపేటలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ అభివృద్ధిలో రాజ్యాంగ నిర్మాతల సహకారం మరువలేమన్నారు.
రాజ్యాంగంలోని నిబంధనలు ప్రజాస్వామ్యానికి రక్షగా నిలుస్తున్నాయన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలు మరువలేనివి, ఆ మహనీయుల ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు బండారు స్వామి గౌడ్, ఈదుగళ్ల పర్శరాములు, క్యాస శివకోటి, కల్లెపు యాదగిరి, పాత్కుల బాలేష్, డా. కుమార్, పులిగారి గణేష్, అజామ్, జహంగీర్, బెజ్జనమైన కృష్ణ, లింగం, పోచయ్య, ఆడెపు శ్రీనివాస్, వడ్డె శేఖర్, వడ్డె యాదగిరి, ఈదుగళ్ల స్వామి, నరేష్, సాయిలు, మధు, ఎర్రోళ్ల ఎల్లం, బాలు బెజ్జనమైన గణేష్, యాదగిరి, చింటు తదితరులు పాల్గొన్నారు.