హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : ఐఐటీలు సహా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఆదివారం ఐఐటీ మద్రాస్ విడుదల చేయనుంది. మే 26న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను జాతీయంగా నిర్వహించగా తెలంగాణ నుంచి 24వేలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.
నిరుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా టాపర్‌గా తెలంగాణకు చెందిన వావిలాల చిద్విలాస్‌రెడ్డి నిలిచారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌లో15 మంది వంద పర్సంటైల్‌ను సాధించారు. జోసా కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 15న మాక్ సీట్ల కేటాయింపు -1, 17న మాక్ సీట్ల కేటాయింపు -2 ఉంటుంది. 18వ తేదీతో రిజిస్ట్రేషన్ ముగుస్తుంది. 19న వెరిఫికేషన్‌ను చేపడతారు.