‘పోతే ఒక్కడినే.. వస్తే పది మంది అని ప్రమాదానికి ఎదురెళ్లిన నీకు సలాం..’ అంటూ ఖమ్మం జిల్లాలో తొమ్మిది మందిని కాపాడిన జేసీబీ డ్రైవర్ సుభాన్‌ఖాన్ సాహసాన్ని ఉద్దేశించి కేటీఆర్ కొనియాడారు. ఆయనకు ఫోన్‌చేసి అభినందించినట్టు సోమవారం ఎక్స్ వేదికగా తెలిపారు. సుభాన్ఖాన్ను తాను త్వరలో
కలుస్తానని వెల్లడించారు. ‘వారిని రక్షించేందుకు హెలికాప్టర్‌ను ఎలా తేవాలని ప్రభుత్వం ఆలోచిస్తూ చేష్టలుడిగితే, ధైర్యంగా ముందుకెళ్లి వారిని రక్షించిన సుభాన్‌ఖాన్ రియల్ హీరో.. నీ సాహసానికి సెల్యూట్’ అంటూ అభినందించారు.