చిట్యాల (మొగుళ్లపల్లి), సెప్టెంబర్ 12 : డెంగ్యూ తో ఓ చిన్నారి గురువారం మరణించింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇస్సిపేటకు చెందిన జన్నె రాజు కుమార్తె సాయిశ్రీ(6)కి ఇటీవల జ్వరం రావడంతో పరకాలలోని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు.
మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని డాల్పిన్ చిల్డ్రన్స్ కేర్‌కు మొదట చి న్నారి ఆరోగ్యం బాగుందని చెప్పిన వై ద్యులు బుధవారం డెంగ్యూగా నిర్ధారించినట్టు చెప్పారు. గురువారం పరిస్థితి విషమించి మృతి చెందింది. కు టుంబ సభ్యులు, బంధువులు దవాఖాన ఎదుట ఆందోళన చేశారు.