దేవరుప్పుల, డిసెంబర్ 16: తెలంగాణ సాయుధ రైతాంగ యోధుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురంనకు చెందిన శతాధిక వృద్ధుడు జాటోతు దర్గ్యా నాయక్(107) సోమవారం రాత్రి అస్తమించారు.
జాటోత్ తండాకు చెందిన జాటోత్ ఆమూ- మంగ్లీల కుమారుడు దర్గ్యానాయక్ రైతాంగ సాయుధ పోరాట అమరుడు ధానూనాయక్కు తమ్ముడు. ధానూనాయక్ ఆరుగురు అన్నదమ్ములంతా సాయుధ పోరులో పాల్గొన్నవారే కాగా మిగిలింది దర్గ్యా నాయక్ ఒక్కరే.