రఘునాథపల్లి, ఆగస్టు 1: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లాలో గురువారం చోటుచేసుకున్నది. రఘునాథపల్లి మండలం కుసుంబాయితండాకు చెందిన కొర్ర ఉమల్ (32) తనకున్న రెండెకరాల్లో వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషించుకునేవాడు. దిగుబడి రాక రెండేండ్లలో 8 లక్షల అప్పు అయింది.
అప్పు తీర్చే మార్గం లేక మనస్తాపం చెందిన ఆయన ఇం ట్లో ఎవరూ లేని సమయంలో జూలై 30న పురుగుల మందుతాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే జనగామ ఏరి యా దవాఖానకు తరలించగా అక్కడి నుంచి వరంగల్ ఎం జీఎం దవాఖానలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు.