నర్మెట, అక్టోబర్ 16: హరితహారంలో భాగంగా 2020-21వ సంవత్సరంలో రోడ్డు పక్కన నాటిన మొక్కలను జేసీబీతో తొలగించిన వ్యక్తికి జనగామ జిల్లా నర్మెట గ్రామ పంచాయితీ రూ.20 వేల జరిమానా విధించింది. అలాగే అదే స్థలంలో ఆరు మొక్కలు నాటి కాపాడాలని ఆదేశించింది.
నర్మెట-హుస్నాబాద్ రహదారిలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల సమీపంలో రోడ్డు పక్కన రెం డేండ్లుగా పెంచిన 6 చెట్లను సిమెంట్ ఇటుకలు తయారీ చేస్తున్న సామల రాజు నరికివేశాడు. హరితహారంలో నాటిన మొక్కలను తొలగించిన విషయం సర్పంచ్ కమలాకర్‌రెడ్డి దృష్టికి వచ్చింది. దీంతో చెట్లు నరికిన వ్యక్తికి రూ.20 వేల జరిమానాతోపాటు 6 మొక్కలు నాటి కాపాడాలని పంచాయతీ సిబ్బంది ఆదేశించింది. ఆదివారం సామల రాజు జరిమానా చెల్లించాడు.