హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): జనసేన పార్టీకి తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆదరణ దక్కలేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 332 వార్డులు, డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు పోటీకి దిగితే.. కేవలం ఒకే ఒక్క వార్డులో ఆ పార్టీ గెలుపొందగలిగింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డు నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఆరూరి విజయలక్ష్మి 60 ఓట్ల మెజారిటీతో గెలిచ
పాపం కొమురయ్య!
సంగారెడ్డి మున్సిపాలిటీలో నాలుగో వార్డు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన జంగా కొమురయ్యకు రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఫలితాలు చూసిన కొమురయ్య తన ఇంట్లో 6 ఓట్లు ఉండగా, తనకు 2 ఓట్లే ఎలా వచ్చాయని రీకౌంటింగ్‌కు పట్టుబట్టాడు. రీకౌంటింగ్ నిర్వహించిన అధికారులు లెక్కింపు అనంతరం.. కొమురయ్యకు పడిన ఓట్లలో ఒక్కటే చెల్లినట్టు తేల్చారు.