హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టకుండా ప్రధాని మోదీ ద్రో హం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ ప్రధాన కార్యదర్శి సచిన్ రాజోలర్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో ని చంద్రాపూర్ జిల్లాలో గాంధీక్ నుంచి కలెక్టరేట్ వరకు వేలాది మందితో మహా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో జాజుల, కేసన శంకర్రావుతోపాటు16 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ర్యాలీ అనంతరం కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన సభలో జాజుల మాట్లాడారు. ఓబీసీ గణన నిర్వహించకుండా, మహి ళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించకుండా ప్రధాని అన్యాయం చే స్తున్నారని ఆరోపించారు. బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ డిసెంబర్లో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో బీసీ సింహగర్జన నిర్వహిస్తామని వెల్లడించారు.