హైదరాబాద్, జూన్7 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని విస్మరించిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
బీజేపీ తన కోటా కిందికి వచ్చే 11స్థానాలకు బీజేపీ పార్టీ ఓసీలకు 6 బీసీలకు 4, ఎస్టీలకు 1 సీటును కేటాయించిందని వివరించారు. కానీ కాంగ్రెస్ మాత్రం తన కోటా 7 స్థానాల్లో ఓసీలకు 4, ఎస్సీలకు 2, మైనారిటీలకు 1 కేటాయించిందని, బీసీలకు మొండిచెయ్యి చూపిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మాటలకు, ఆచరణకు ఎకడా పొంతనలేదని, రాజ్యసభ సీట్ల కేటాయింపే ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు.