హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): బీసీ నాయకుడు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌పై ఓ టీవీ చానల్ ఉద్దేశపూర్వకంగా కల్పిత వార్తలు ప్రసారం చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. శనివారం ప్రకటన విడుదల చేశారు. బడుగులను అవమానించే రీతిలో వ్యవహరిస్తున్న బిగ్ టీవీ చానల్ భరతం పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. అసత్య కథనాలు ప్రసారం చేసిన చానల్ యాజమాన్యం 24 గంటల్లోగా బీసీలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించా రు.