హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుతమున్నది రాహుల్ కాంగ్రెస్ కాదని, ఇది రెడ్ల కాంగ్రెస్ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీది కుకతోక వంకర బుద్ధి అని నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని టికెట్లు రెడ్లకే కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ కులగణన చేసి ఎవరి వాటా వారికిస్తామని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు నీటిమీద మూటలేనని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ చెప్పేదొకటి, చేసేదొకటని.. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్లకు టికెట్లు ఇవ్వడమే నిదర్శనమని ఉదహరించారు.