JNTU | కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ రెండో సంవత్సరం చదువుతున్న అర్నిపల్లి హితేశ్ అదృశ్యమయ్యాడు. మల్యాల సర్కిల్ సీఐ నీలం రవి, కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం జిల్లా గరువుబిల్ల మండలం రావివలస గ్రామానికి చెందిన హితేశ్ 2023లో మెకానికల్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఈ నెల 19న కళాశాల ఓల్డ్ హాస్టల్ బంగ్లా పక్కనున్న గోడవైపు నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు.
రాత్రి హాస్టల్‌కు తిరిగి రాకపోవడంతో కేర్ టేకర్ యుగేంధర్ కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. విద్యార్థి తండ్రి శ్రీనివాసరావు తన కొడుకు ఉంటున్న రూమ్ నంబర్ 320లోని తోటి స్నేహితులను విచారించాడు. మల్యాల సీఐ నీలం రవి హితేశ్ తోటి విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గత రెండు రోజులుగా హితేశ్ మూడీగా ఉంటున్నాడని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు, పోలీసులకు వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపాడు. విద్యార్థి సెల్ ఫోన్ ట్రేస్ చేయగా హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో చూపిస్తుండడంతో రెండు పోలీస్ బృందాలను హైదరాబాద్ పంపినట్లు సీఐ వివరించారు.
ఇవి కూడా చదవండి..
ACB | నక్ష కోసం రూ. 20 వేలు డిమాండ్.. ఏసీబీకి చిక్కిన సీనియర్ డ్రాఫ్ట్‌మెన్
BRS MLC | బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి తప్పిన భారీ ప్రమాదం..
Harish Rao | ఇవి కూడా ఆయన ఖాతాలోనే వేసుకుంటారేమో..! రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు సెటైర్లు