మల్లాపూర్ : రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తరు? అంటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట రైతులు ప్రశ్నిస్తున్నారు. పట్టాదారు పాస్‌బుక్, ఆధార్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులను చూపుతూ ఆదివారం గ్రామంలో నిరసన తెలిపారు. రూ.2 లక్షలలోపు రుణం తీసుకొని మాఫీ కాని రైతులు సుమారు 150 మంది ఉన్నారని, అలాగే రూ.2 లక్షలకుపైబడి రుణం తీసుకున్నవారు సుమారు 200 మందికిపైగా ఉన్నట్టు వారు స్పష్టం చేశారు.
రుణమాఫీ కానివారి కోసం మొగిలిపేట మాజీ సర్పంచ్ వనతడపుల నాగరాజు ఆధ్వర్యంలో గ్రామంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి, రైతుల నుంచి సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కూడిన దరఖాస్తులను తీసుకున్నారు. శిబిరంలో 54 మంది రైతులు దరఖాస్తులు అందజేయగా, వీటిని సోమవారం జగిత్యాల కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని మాజీ సర్పంచ్ తెలిపారు.