హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దుర్మార్గపు, పిరికిపంద పాలన కొనసాగిస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయిం ట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై చర్చకు భయపడి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తామనే అక్కసుతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ గేటు వద్దే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకునే అధికారం రాజ్యాంగబద్ధంగా స్పీకర్‌కుగానీ, పోలీసులకుగానీ లేదని స్ప ష్టంచేశారు.
సభలో చర్చలపై సమాధానం చెప్పుకోలేక, ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా కాంగ్రెస్ విప్‌లు, ఎమ్మెల్యేలను ఉసిగొల్పి మాజీ సీఎం కేసీఆర్ నివాసంపై దాడులకు పంపుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు అడ్డుకోవాల్సిందిపోయి, వారికి రక్షణగా వెళ్లడం అత్యంత శోచనీయమని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆగ్ర హం వ్యక్తంచేశారు. కేసీఆర్ నివాసం ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, గూండాలపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, వారికి కొమ్ముకాసిన పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాణిక్‌రావు పాల్గొన్నారు.