‘శుభకృత్’ పేరులోనే శుభం ఉందని, అందరికీ మంచే జరుగాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈ ఏడాది మరింత జనరంజకంగా సాగాలని కోరుకున్నారు. నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో నిరాటంకంగా కొనసాగుతున్న సంక్షేమం, అభివృద్ధికి శుభకృత్ తోడవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలకు అంతా మంచే జరుగాలని కోరుకుంటున్నానన్నారు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉగాది పండుగ జరుపుకోవాలని సూచించారు.