Jagadish Reddy | పోలీసులు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని తిరుగుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అడ్డాగా మారాయని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్త మధు అంత్యక్రియల్లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగిపోయాయని జగదీశ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నశించాయని అన్నారు. ఇప్పటివరకు తమ జిల్లాలో ఇద్దరు కార్యకర్తలను పొట్టన బెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు శిక్షలు పడేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
2018లో జరిగిన బీఆర్ఎస్ నాయకుడి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న మధును కాంగ్రెస్ నాయకులు అనేకసార్లు బెదిరించారని తెలిపారు. ఓ పోలీసు అధికారి స్వయంగా పిలిచి నువ్వు ఎగిరిపోతావని బెదిరించాడని పేర్కొన్నారు. ఈ హత్య పోలీసు అధికారులకు తెలిసే జరిగిందని అన్నారు. అందుకే మధును ముందే పోలీసు అధికారి హెచ్చరించారని చెప్పారు. పోలీసోళ్లు బెదిరిస్తున్నారని చెబితే జాగ్రత్తగా ఉండమని చెప్పానని.. కానీ ఏదో పంచాయతీ ఉందని పిలిచి మధును హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా కార్యకర్తను హత్య చేసిన నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేయలేదని తెలిపారు.
పోలీస్ అధికారి స్వయంగా బీఆర్ఎస్ నాయకుడిని పిలిచి నువ్వు ఎగిరిపోతావ్ అని బెదిరించాడు
సూర్యాపేటలో బీఆర్ఎస్ నాయకుడు మధు హత్యపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
2018లో జరిగిన బీఆర్ఎస్ నాయకుడి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న మధును కాంగ్రెస్ నాయకులు అనేక సార్లు… https://t.co/Ih0t8TpHBH pic.twitter.com/LfjSxRvyAZ
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2026
కాంగ్రెస్ గూండాల చేతిలో దారుణమైన హత్యకు గురైన మా కార్యకర్త మధు కుంటుంబ పోషణ బాధ్యత, పిల్లల చదువుల బాధ్యత బీఆర్ఎస్ పార్టీనే తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కేసులో ఏ అధికారి తప్పు చేసినా మేము గమనిస్తూనే ఉంటామని తెలిపారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ అధికారి తప్పించుకోలేడని హెచ్చరించారు. ఇలాంటి క్రిమినల్ కేసులు పదేండ్ల తర్వాత కూడా ఓపెన్ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు. తప్పు చేస్తే ఐజీ, డీజీ స్థాయి అధికారులను కూడా వదిలేది లేదని స్పష్టం చేశారు. అది దృష్టిలో పెట్టుకొని పోలీస్ అధికారులు విచారణ చేయాలని సూచించారు.
మధు కుంటుంబ పోషణ బాధ్యత, పిల్లల చదువుల బాధ్యత బీఆర్ఎస్ పార్టీనే తీసుకుంటుంది
ఈ కేసులో ఏ అధికారి తప్పు చేసినా మేము గమనిస్తూనే ఉంటాము.. ఆ అధికారి మాత్రం తర్వాత తప్పించుకోలేడు
ఇలాంటి క్రిమినల్ కేసులు 10 ఏండ్ల తర్వాత కూడా ఓపెన్ చేసి బాధ్యులైన వాళ్ల మీద చర్యలు తీసుకున్న సందర్భాలు… https://t.co/zx4GNBT2gn pic.twitter.com/EerBHqs7Pn
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2026