నల్లగొండ : నల్లగొండ కుక్క మూతి నేతలకు మేం భయపడం. తెలంగాణ రాష్ట్రం రైతాంగం మద్దతుతో ఏర్పడిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు. నల్లగొండ జిల్లాలోని క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన రైతు మహా ధర్నాలో(Rythu maha Dharna) ఆయన కేటీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణలో కరెంట్ ధరల పెంపును ఒప్పుకోను అని చెప్పి నాడు కేసీఆర్ రాజీనామా చేశారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులే మద్దతుగా నిలిచారన్నారు. ‘కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో’ నినాదాలతో తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చాక ప్రజల కోరిక మేరకు అధికారం చేపట్టారు. అధికారంలోకి వచ్చాక రైతులను రాజులను చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీలదీస్తే కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. అయినా కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్, రైతులు నల్లగొండకు భారీగా తరలి వచ్చారు. కేటీఆర్‌కు రాహుల్ గాంధీనే పోటీ, ఇక్కడ జిల్లా నేతల గురుంచి కాదని స్పష్టం చేశారు.