సూర్యాపేట: కాంగ్రెస్ పాలనలో(Congress) ఏడాది గడిచినా హామీలు అమలుకాలేదు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy )అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని కేటీ అన్నారం గ్రామంలో జరుగుతున్న ప్రజా పాలన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజల సమస్యల వరిష్కరించడం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. సీఎం, మంత్రులు, అధికారుల్లో సమన్వయ లోపం కనబడుతుందన్నారు. కేసీఆర్ మాదిరిగానే పార్టీలకతీతంగా ప్రజలకు పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా రూ.12 వేలకు బదులు ఇచ్చిన హామీ ప్రకారం రూ.15 వేలు ఇవ్వాలన్నారు. మహిళలకు, యువతకు భరోసా, నిరుద్యోగ భృతి మరిచిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. ఆటో కార్మికులను ఆదుకుని వారికీ అండగా నిలవాలని సూచించారు. వ్యవసాయానికి తప్పనిసరిగా 24 గంటల విద్యుత్ ఇవ్వాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం జలాలను వరుసగా 8 కార్లకు అందించినం. కాంగ్రెస్ రైతులకు నీళ్లందించడంలో విఫలమై పంటలు ఎండబెట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలపక్షాన కొట్లాడేందుకు బీర్ఎస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుదని స్పష్టం చేశారు. ప్రజల యోగక్షేమాలు చూడటంలో కేసీఆర్ను మించిన వాళ్లు లేరన్నారు. హామీలన్నీ అమలు చేయడంలో ఇక్కడి మంత్రులు, ఇంచార్జ్ మంత్రి తుమ్మల ప్రత్యేక దృష్టి సారించాలి. లబ్ధిదారుల ఎంపిక విషయంలో అవకతవకలుంటే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని హామీనిచ్చారు.