హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : బడ్జెట్ అంతా మోసం, ద్రో హం అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డా రు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలుపుతూ.. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కేపీ వివేకానందతో కలిసి ఆయన మాట్లాడా రు. ఈ బడ్జెట్‌తో ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల చెవుల్లో పూలు పెట్టిందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలను విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉ ద్యోగులు, నిరుద్యోగుల ప్రస్తావన లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం మో సం చేసిందని, ఈ బడ్జెట్లో సైతం ఉద్యోగాల ప్రస్తావన లేదని ధ్వజమెత్తారు. మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేల పింఛన్ పెంపు ఏమైంది? అని ప్రశ్నించారు. రైతులకు ఈ ఏడాది రైతుభరోసా కింద రూ.15వేలు ఇస్తారని భావిస్తే, బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు రూ.వెయ్యి ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చి విస్మరించారని దుయ్యబట్టారు. హ్యామ్ రోడ్ల పేరిట పెద్ద స్కామ్‌కు రెడీ అవుతున్నారని ఆరోపించారు.
స్కీమ్‌లు మరచి.. స్కామ్‌లు: గంగుల
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్కీమ్‌లు మరచి స్కామ్‌లకు తెరలేపారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పా యింట్ వద్ద చెవిలో పూవ్వు పెట్టు కొని నిరసన తెలిపి మాట్లాడారు. బీసీలకు నిధులు కేటాయించకుండా గొంతు కోశారని మండిపడ్డారు. బీసీలకు ప్రతి బడ్జెట్లో రూ.20వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి, నిరుటి కంటే తగ్గించారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఆరున్నర లక్షల రేషన్ కా ర్డులు ఇచ్చామని సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ చెప్పారని, బడ్జెట్లో మాత్రం గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని చేర్చడం ఏంటి? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు సైతం బడ్జెట్లో భారీగా కోతలు విధించారని మండిపడ్డారు.
హైదరాబాద్‌కు సున్నా ఎమ్మెల్యే కేపీ వివేకానంద
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో హైదరాబాద్‌కు ఒక్క రూపా యి కేటాయించలేదని బీఆర్ఎస్ విప్, కుత్బుల్లాపూ ర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డా రు. రాష్ట్రంలో 53% జనాభా ఉన్న హైదరాబాద్‌కు నిధులు కేటాయించకపోవ డం ఏంటి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌తో అన్నివర్గాల ప్రజల చెవుల్లో పూలు పెట్టిందని ఎద్దేవా చే శారు. హైదరాబాద్‌ను మూడు విభాగాలుగా చేసి దోచుకోవాలని కాంగ్రెస్ చూ స్తున్నదని తాము చెప్పిందే నిజమైందన్నారు. రాష్ర్టానికి ఎక్కువ ఆదాయం ఇచ్చే హైదరాబాద్‌కు నిధులేవి? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో స్కేర్ ఫీట్‌కు రూ.100-200 ముక్కుపిండి వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు.
పాత బడ్జెట్‌నే మళ్లీ పెట్టినట్టుంది: కూనంనేని
ఈ బడ్జెట్లో గత బడ్జెట్ అంకెలనే ప్రస్తావించినట్టు, వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నదని సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్రం రూ.8.64 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, మరో రూ.లక్ష కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నదని, వాటిని చూపించలేదని పేరొన్నారు. విద్య, వైద్యరంగాలకు నిధులు పెంచాలని కోరారు.
బీసీలకు తీవ్ర అన్యాయం: కిశోర్‌గౌడ్
వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నేత కిశోర్‌గౌడ్ విమర్శించారు. ఒక వైపు 42 శాతం రాజకీయ రిజర్వేషన్ల విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, మరో వైపు బడ్జెట్ కేటాయింపుల్లోనూ బీసీలను విస్మరించడం దారుణమని పేర్కొన్నారు. ఇది ‘సంక్షేమ బడ్జెట్ కాదు.. కమిషన్ల బడ్జెట్’ అని ఆయన ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు కామారెడ్డి డిక్లరేషన్‌ను ఒకసారి చదువాలని కిశోర్‌గౌడ్ హితవు పలికారు.