నల్లగొండ : ఆరునూరైనా నల్లగొండ(Nalgonda)లో బీఆర్ఎస్ బహిరంగ సభ(BRS open meeting) నిర్వహించి తీరుతాం. తెలంగాణ రైతాంగ హక్కుల సాధనకు పేగులు తెగే దాకా కొట్లాడుతామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagdish Reddy) అన్నారు. బుధవారం నల్లగొండలో ఈనెల 13న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యే బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భందగ ఆయన మాట్లాడుతూ.. పెద్ద పెద్ద రాకాసులతోనే కొట్లాడినోళ్లం.
ఈ చిన్న చిన్న రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి లాంటి వాళ్లు మాకు లెక్క కాదన్నారు. పోలీస్ యాక్టులు, నిర్భందాలు సంకెళ్లు మాకు కొత్త కాదన్నారు. మేం ఫైటర్స్ చివరి ఉద్యమిస్తామని పేర్కొన్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పిన కాంగ్రెస్ నాయకులు భాగోతం అంతా బట్టబయలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరుతో సాగర్ ఆయకట్టు రైతాంగం మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చేజేతులా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పిన నీచులు కాంగ్రెస్ వాళ్లు అని మండిపడ్డారు. మళ్లీ ఎదురు దాడి చేస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతిన్నారు. కేంద్రం నుంచి ఏదో ఆశించే కాంగ్రెస్ వాళ్లు ప్రాజెక్టులను అప్పజెప్పారని విమర్శించారు. సాగర్ డ్యామ్ పై కేంద్ర బలగాలు మోహరించాయి. కాలు కూడా పెట్టనివ్వడం లేదు.
ఉత్తమ్ లాంటి వ్యక్తి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా అవగాహన లేదని ఎద్దేవా చేశారు.
కోమటిరెడ్డికి మతిస్థిమితం లేదన్నారు. పోలీసులతో రాజ్యం నడపాలని చుస్తే పతనం తప్పదని హెచ్చరించారు. పోలీసులను అడ్డుపెట్టుక్కని నాటకాలు ఆడితే ప్రజలు ఉరికించి కొడతారన్నారు.