ఆత్మకూర్.ఎస్, ఏప్రిల్ 22 : సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన రైతులు బండెనక బండి కట్టి ఎడ్ల బండ్లపై ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మంగళవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మం డలం నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి ఎడ్లబండ్ల యాత్రను ప్రారంభించారు. 5 కిలోమీటర్లు ఎడ్లబండిని నడిపి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కేసీఆర్ సారథ్యంలో నిర్వహించనున్న 25ఏండ్ల బీఆర్ఎస్ పండుగకు సూర్యాపేట నుంచి రైతులు ఎడ్లబండ్లతో తరలివెళ్లడం ఆ నందంగా ఉందన్నారు. బండెనక బండి కట్టి.. 16 బండ్లు కట్టి.. అన్న పాటను సూర్యాపేట రైతులు మళ్లీ గుర్తుచేస్తున్నారని చెప్పారు. పది రోజుల క్రితం రైతులు తనను కలిసి ఎడ్ల బం డ్లపై వెళ్దామంటే, 130 కిలోమీటర్ల మేర ఎం డలో వెళ్లడం సాధ్యమైద్దా అనగా, ‘కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను తట్టుకున్నోళ్లం.. ఎండలను తట్టుకోవడం లెక్క కాదు’ అని రైతులు చెప్పారని గుర్తుచేశారు. ఎడ్లబండ్లతో బయల్దేరిన రైతులకు చివ్వెంల బీఆర్ఎస్ నాయకుడు జూలకంటి జీవన్‌రెడ్డి పశుగ్రాసం కోసం రూ.5 వేలు అందజేశారు.