నీలగిరి, ఫిబ్రవరి 4 : ప్రపంచ చరిత్రలోనే రేవంత్‌రెడ్డి లాంటి చెత్త ముఖ్యమంత్రి ఎవరూ ఉండరని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని బుధవారం ఆయన పానగల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మిర్యాలగూడలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనపై తీవ్రస్థాయిలో స్పందించారు. రేవంత్‌రెడ్డి ఎన్నికలు ఉన్నప్పుడే రైతుబంధు వేస్తానంటాడని మండిపడ్డారు. రైతుబంధు రైతుల హకు అని, తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ‘ఇప్పటికే మూడుసార్లు ఎగ్గొట్టినవ్.. కేవలం మున్సిపల్ ఎన్నికలు ఉన్నయ్ కాబట్టి మళ్లీ ఇ వ్వాల మభ్యపెడుతున్నవ్.. రైతుబంధు ఇస్తాం అని సన్నాయి నొకులు నొకుతున్నవ్’ అని విమర్శించారు.
మున్సిపాలిటీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ మిర్యాలగూడ సభలో శంకుస్థాపనలు చేసి హడావుడి చేశారని దుయ్యబటారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించాలని కోరారు. సీఎం జిల్లాల పర్యటనకు వస్తే జిల్లా అభివృద్ధి కోసం నిధులు ఇస్తారని, జిల్లా ప్రజలు ఎదురు చూశారని అన్నారు. రేవంత్‌రెడ్డి కూడా జిల్లాకు వచ్చిండు ఏమి నిధులు ఇవ్వలేదని, అవే చిల్లర మాటలు మాట్లాడి పోయిండని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎన్ భాసర్‌రావు మీద కూడా అవాకులు మాట్లాడిండని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కం చ ర్ల భూపాల్‌రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.