యాదగిరిగుట్ట, జూన్ 18 : రాష్ర్టాన్ని పాలించేది హైబ్రిడ్ ముఖ్యమంత్రి అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ, ఆంధ్రా సీఎం చంద్రబాబు నాటిన హైబ్రిడ్ విత్తనమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని తెలిపారు. ఇప్పటికీ ఆంధ్రా సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే రాష్ట్రంలో పాలన సా గుతున్నదని విమర్శించారు. గురువారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి ఫం క్షన్ హాలులో ఆలేరు నియోజకవర్గ స్థాయి ఎస్ఐఆర్పై బూత్ లెవల్ ఏజెంట్ల అవగాహన కార్యక్రమంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడా రు. కాంగ్రెస్ పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ భూమి శిస్తు రద్దు చేస్తే.. ఇప్పుడు మళ్లీ రేవంత్‌రెడ్డి సర్కార్ భూమి శిస్తు ప్రవేశపెట్టే పనిలో ఉన్నదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పని ఖతమైందని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీకి అధికారా న్ని కట్టబెట్టేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్ర భుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశ్ కురుమ, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, రాష్ట్ర నాయకుడు కే రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.