గ్రంథాలయాలు విజ్ఞాన భాండగారాలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
Jadcherla Library | గ్రంథాలయాలు విజ్ఞాన భాండగారాలు అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. జడ్చర్ల పట్టణంలోని కావేరమ్మపేటలో రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రంథాలయ

మహబూబ్‌నగర్ : గ్రంథాలయాలు విజ్ఞాన భాండగారాలు అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. జడ్చర్ల పట్టణంలోని కావేరమ్మపేటలో రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రంథాలయ భవనంతో పాటు బాదేపల్లిలో రూ. 15 లక్షల వ్యయంతో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, 2తో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు, గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. భవిష్యత్‌లో తెలంగాణ తప్పక ధనిక రాష్ట్రం అవుతుందని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలందరం కలిసి హైదరాబాద్‌కు దీటుగా మహబూబ్‌నగర్‌ను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్లను కలిపి మహానగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. మన్యంకొండ వద్ద ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
జడ్చర్ల పట్టణం ఎంతో అభివృద్ధి సాధించింది : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత పట్టణాలు, గ్రామాల రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. జడ్చర్ల పట్టణం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు. అలాగే గ్రంథాలయాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని అన్నారు. తెలంగాణ వచ్చాక అన్ని రంగాల్లో మార్పులు వచ్చాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, సుదర్శన్ గౌడ్, డిసిఎంఎస్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సారిక,జిల్లా గ్రంథాలయ సెక్రటరీ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

