హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): సమస్యలను పరిష్కరించకుంటే మరో ఉద్యమం తప్పదని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. గురువారం తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. నూతన ప్రభుత్వం పెన్షనర్లకు, ఉద్యోగులకు అనేక ఆశలు చూపి ఒకటీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉద్యోగులు, పెన్షనర్లకు రావలసిన డీఆర్, హెల్త్‌కార్డులను అమలు చేయాలని డిమాండ్ చేసింది. లేకపోతే జూలై రెండో వారంలో ‘చలో హైదరాబాద్’ ఉద్యమ కార్యాచరణను చేపట్టాలని సమావేశం తీర్మానించింది. అంతకుముందు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ కే శ్రీరామచంద్రమూర్తి జేఏసీ సావనీర్-24ను ఆవిషరించారు. రెండో సెష న్లో పెన్షనర్ల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలపై జేఏసీ ప్రతినిధులు చర్చించారు. జనరల్ సెక్రటరీ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.