హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపడితే సహించేది లేదని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జా యింట్ యాక్షన్ కమిటీ(టీజీపీఈజేఏసీ)హెచ్చరించింది. రైతు డిస్కమ్ విధివిధానాలపై స్పష్టత కోసం నిపుణుల కమిటీ వేయాలని డిమాండ్ చేసింది. ఈ డిస్కమ్ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలున్నాయని అభిప్రాయపడింది. రైతు డిస్కమ్ ఏర్పాటు పరిణామాలపై జేఏసీ నేతలు మంగవారం మింట్ కాంపౌండ్‌లోని 1104 యూనియన్ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. అనంతరం రైతు డిస్కమ్ చైర్మన్ ముషారఫ్ అలీ ఫారూకీని కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తంచేశారు. సమావేశంలో జేఏసీ చైర్మన్ జీ సాయిబాబు, కన్వీనర్ పీ రత్నాకర్‌రావు, జనరల్ సెక్రటరీ శ్రీధ ర్, కో కన్వీనర్ తాజుద్దీన్‌బాబా, కరుణాకర్‌రెడ్డి, స్వామి, మహిపాల్, నాగరాజు, భూపాల్‌రెడ్డి, యజ్ఞప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
డిస్కమ్ ఏర్పాటుపై పునరాలోచించాలి
రైతు డిస్కమ్‌తో ఎలాంటి ప్రయోజనం లేదని, ఈ డిస్కమ్ ఏర్పాటుపై పునరాలోచించాలని జేఏసీ నేతలు కో రారు. ఈ డిస్కమ్‌తో రైతులు, ఉద్యోగులు, వినియోదారులు, విద్యుత్తు సంస్థలకు ఎలాంటి మేలు జరుగదని పేర్కొన్నారు. రైతు డిస్కమ్‌లో చేరేందుకు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులకు ప్ర మోషన్లు ఇస్తామని అధికారులు ఆశ చూపుతున్నారని, కానీ ఇప్పుడున్న నిబంధనల ప్రకారం సీనియారిటీ సమస్యలు తలెత్తుతాయని నేతలు అభిప్రాయపడ్డారు.
ఇవీ డిమాండ్లు..