హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ) : ఆర్టీసీలో సమస్యలు పరిష్కరించాలని ఈ మేరకు అసెంబ్లీలో చర్చించాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్ రెడ్డి, కో కన్వీనర్లు మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావును కలిసి వి న్నవించారు.
అలాగే సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను కలిశారు.