హైదరాబాద్, నవబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులపై దాడులు మంచి పద్ధతి కాదని, వికారాబాద్ జిల్లాలో అధికారులు, ఉద్యోగులపై దాడిచేసినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి కోరారు. ఆయన ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు డీజీపీ జితేందర్‌ను మంగళవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తిలేదని.. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు డీజీపీ చెప్పారని జేఏసీ నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో జేఏసీ నాయకులు కే రామకృష్ణ, ఎస్.రాములు, రమేశ్ పాక, సెక్రటరీ జనరల్ ఫూల్ సింగ్‌చౌహాన్, రాధ, తెలంగాణ నిర్మల, చంద్రశేఖర్‌గౌడ్, రాబర్ట్ బ్రూస్, పుష్పలత, తిరుపతి, విజయ్‌కుమార్, హరీందర్‌సింగ్ తదితరులున్నారు. దాడిచేసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు ఇతర ముఖ్యనేతలు డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు.