హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. నాల్గోరోజు ఆదివారం ముఖ్యంగా చిట్ ఫండ్, ఫైనాన్స్ సంస్థలపై సోదాలు జరిపారు. అమీర్ పేట్, కూకట్పల్లి, శంషాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు. చిట్ఫండ్ పెట్టుబడులను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఆయా సంస్థలపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కీలకమైన డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారం.