నయీంనగర్, అక్టోబర్ 6 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాకీ ఉన్నమాట నిజమేనని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అంగీకరించారు. సోమవారం హనుమకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాకీ కార్డుల పేరుతో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. బాకీ ఉన్న మాట నిజమేనంటూనే ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని తెలిపారు.