నల్లగొండ : రాజకీయాల్లోకి కుటుంబాలను, పిల్లలను లాగడం బీజేపీ పార్టీకి అలవాటేనని చిరుమర్తి లింగయ్య అన్నారు. రాబోయే ఎన్నికల్లో వారికి పుట్టగతులుండవని ఎమ్మెల్యే విమర్శించారు. మంగళవారం నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి మీడియా సమావేశంలో మాట్లాడారు.
బండి సంజయ్ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదం. అది నిరుద్యోగ దీక్ష కాదు. సిగ్గులేని దీక్ష
అని ఘాటుగా విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అంది. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం సమాధానం చెప్పాలన్నారు.
డీమానిటైజేషన్, GST నిర్ణయాలతో కొత్తగా వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? ఊడిన ఉద్యోగాలు ఎన్నో చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు.
చేనేత మీద 5 శాతం GST ని 12 శాతం పెంచినది బీజేపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. మీడియాలో స్పేస్ కోసమే కాంగ్రెస్ నేతలు ఆరాటపడుతున్నారన్నారని ఆరోపించారు. రైతులను రక్షించుకునే ఆలోచన ఉంటే బీజేపీ నాయకులు ఢిల్లీలో కూర్చొని మోదీ దగ్గర ఎందుకు మాట్లాడడం లేదు.
పంజాబ్ రాష్ట్రంలో ధాన్యం 90 శాతం కోనుగోలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కొనుగోలు చేయటం లేదో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ రైతులపై కడుపు మంటతో ధాన్యం కొనుగోలును రాజకీయం చేసే పరిస్థితి దాపురించిందన్నారు. కేంద్రం ఒక మాట గల్లీ లీడర్ బండి సంజయ్, దొంగ రేవంత్ ఒక విధంగా మాట్లాడుతూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.