హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ):దేశంలో స్వాతం త్య్రం వచ్చిన తర్వాతి తరం నాయకులను స్వాతంత్య్ర సమరయోధులుగా చిత్రీకరించే దుస్థితి నెలకొన్నదని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే నారాయణ విమర్శించారు. దేశంలో మహాత్మా గాంధీ పేరును సం క్షేమ పథకాల నుంచి కేంద్రం కుట్రపూరితంగా తొలగిస్తున్నదని మండిపడ్డారు. అహింస, లౌకికత్వం, సామాజిక న్యాయం వంటి గాంధేయ విలువలను బలహీనపరుస్తూ, స్వాతంత్య్ర పోరాటానికి దూరంగా ఉన్న శక్తులు నేడు చరిత్రను తమకు అనుకూలంగా వక్రీకరిస్తూ తిరగరాసుకోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. ఇది దేశ ప్రతిష్టకు అవమానం అని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మోదీ ప్ర భుత్వం చేస్తున్న కుట్రను సీపీఐ ఖం డిస్తున్నదని తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనని మాజీ ప్రధా ని వాజ్పేయి విగ్రహాలను దేశవ్యాప్తం గా ఏర్పాటు, రహదారులు, సంస్థల పేర్లలో మార్పు సరికాదన్నారు.