సిద్దిపేట : ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది కాలం తెచ్చిన కరువు ( Drought ) కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth reddy ) , కాంగ్రెస్ పార్టీ కుటిల బుద్ధితో తెచ్చిన కరువు అని మాజీ మంత్రి హరీష్రావు ( Harish Rao ) ఆరోపించారు. గోదావరి నదిలో కావలసినన్ని నీళ్లు ఉన్నప్పటికీ, కేసీఆర్కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ఈర్ష్యతో కన్నెపల్లి పంప్ హౌస్( Kannepally Pump House ) మోటార్లను ప్రభుత్వం కావాలనే ఆన్ చేయడం లేదని విమర్శించారు.
సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం తిమ్మాయ్ పల్లి గ్రామంలో జరిగిన పెద్దమ్మ దేవాలయ ఉత్సవాల్లో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట జిల్లా పెద్దమ్మ తల్లి రేవంత్ రెడ్డికి సద్భుద్దిని ప్రసాదించాలని కోరుకున్నట్లు వెల్లడించారు. ఎంతటి కరవు వచ్చినా రైతాంగానికి నీరందించేలా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, మోటార్లు ఆన్ చేస్తే రంగనాయక సాగర్ నిండి, సిద్దిపేట నియోజకవర్గంలోని దాదాపు 70 నుంచి 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు.
కాళేశ్వరంతో ఒక్క ఎకరం కూడా పండలేదని వెల్లడించిన ముఖ్యమంత్రి తిమ్మాయిపల్లి గ్రామానికి వచ్చి ప్రజలతో మాట్లాడితే అర్దమవుతుందని అన్నారు. తిమ్మాయిపల్లిలో తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో ఎదురుచూసే పరిస్థితి ఉండేదని, కాళేశ్వరం జలాల రాకతో ఈ ప్రాంతం బంగారు పంటలతో కళకళలాడుతోందని సంతోషం వ్యక్తం చేశారు.ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు నర్మెట ఫ్యాక్టరీ ద్వారా అద్భుతమైన ఆదాయం లభిస్తోందని తెలిపారు.