హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ) : ఇటీవల ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు అవినీతి బాగోతం భారీగానే ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కా కుండా కాపాడాల్సిన ఆ అధికారి.. అవినీతికి తెగమరిగి వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు భారీగా ‘సెటిల్మెంట్లు’ చేసినట్టు తెలుస్తున్నది. వివాదాలున్నవి, గిట్టుబాటయ్యే భూముల్లోనే ఆయన టేపు తో చుట్టిరావడమే గాక సర్కారీ పెద్దలకు ముట్టజెప్పినట్టు వెల్లడవుతున్నది. రెండేళ్లుగా కోట్లు కొల్లగొట్టి ప్రభుత్వ, వివాదాస్పద భూములపై ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా నివేదికలు ఇచ్చినట్టు ఆరోపణ లున్నాయి. కేవలం ఆరు దస్ర్తాలపైనే ఏసీబీ విచారణ చేస్తున్నదని.. తవ్వితే కొండంత చిట్టా వెలుగులోకి వస్తుందని తెలుస్తున్నది.
ఆరు దస్ర్తాలపై లోతుగా విచారణ
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో ఆదాయానికి మించి ఆస్తులు వెలుగుచూసిన ఏడీ శ్రీనివాసులు అవినీతిలో కొన్నింటిపై ఏసీబీ లోతుగా విచారణ చేస్తున్నట్టు తెలిసింది. దాడులు జరిగిన రోజున రంగారెడ్డి కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లోనూ తనిఖీలు చేసి ఆరు సర్వే నివేదికల దస్ర్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఆ దస్ర్తాలన్నీ వెస్ట్‌జోన్‌లోని శేరిలింగంపల్లి, గండిపేట మండలాలవే కావడం గమనార్హం.
రికార్డుల్లో ఒకలా.. నివేదికలు మరోలా!
ఇదంతా ఒకవైపు మాత్రమేనా?
ఏడీ శ్రీనివాసులు అవినీతి లీలలకు సంబంధించి ఏసీబీ స్వాధీనం చేసుకున్నవి కొన్ని మాత్రమే. అందునా అవి వెస్ట్‌జోన్ పరిధిలోని శేరిలింగంపల్లి మండలంలోనివే. కానీ ఇంకా గండిపేట, రాజేంద్రనగర్‌తో పాటు మహేశ్వ రం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మేడ్చల్ జిల్లా పరిధిలోని పలుచోట్ల ప్రభు త్వ భూములు హద్దులు మారి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కి వెళ్లడంలో ఏడీ శ్రీనివాసులు సర్వే నివేదికలు కీలకమయ్యాయనే ఆరోపణలున్నాయి. ఆయన భారీస్థాయిలో మూటగట్టుకున్నట్టు విమర్శలున్నా యి. ముఖ్యంగా గత రెండేండ్లుగా ప్రభుత్వంలోని కొందరు కీలక వ్యక్తుల భూ దందాలకూ శ్రీనివాసులు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఏడీ శ్రీనివాసులు టేపు పట్టేది వివాదాస్పద భూముల్లోనే..