TGCHE | హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ సైన్స్ కో ర్సుల క్రెడిట్లకు ఉన్నత విద్యా మం డలి కోతపెట్టనుంది. ఇప్పటి వరకు సైన్స్ కోర్సుల్లో 160 క్రెడిట్లు ఉండ గా వీటిని 146కు పరిమితం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇదే అం శంపై సబ్జెక్టు నిపుణులు, పలు వర్సిటీల సైన్స్ విభాగాల బోర్డ్ ఆఫ్ స్టడీస్(బీవోఎస్) చైర్మన్లతో త్వరలోనే సంప్రదింపులు జరపనుంది. దీంతో లైఫ్ సైన్సెస్ సహా ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సైన్స్ కోర్సుల్లో క్రెడిట్ల సంఖ్య తగ్గనుంది. దీంతోపాటు ప్రాక్టికల్‌ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుం ది. ప్రాక్టికల్ స్థానంలో ప్రాజెక్ట్ వర్క్ ను అంతర్భాగం చేస్తారు. డిగ్రీ థర్డ్ ఇయర్లో నాలుగు థియరీ, నాలు గు ప్రాక్టికల్స్ పేపర్లుండగా, ఒక ప్రాక్టికల్‌కు బదులుగా ప్రాజెక్ట్ వర్క్ ను చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను వర్కింగ్‌డే లేదా సెలవుల్లో పూర్తిచేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వర్సిటీల్లో క్రెడిట్స్ విధా నం ఒకే తరహాలో లేదు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని వర్సిటీల్లో కామన్ క్రెడిట్ విధానాన్ని అమలుచేయనున్నారు.
ఎంపీహెచ్ఏ పరీక్షకు 84.89% హాజరు
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ) పరీక్షకు 84. 89 శాతం మంది హాజరయ్యారు. 24, 268 మంది దరఖాస్తు చేసుకోగా ఆదివారం సీబీటీ విధానంలో నిర్వహించిన పరీక్షకు 29,600 మంది అభ్యర్థులు హాజరైనట్టు ఎమ్హెచ్ఎస్ఆర్బీ ప్రకటించింది.