Weather Update | హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండ దంచి కొడుతుండగా, రాత్రి పూట చలి పెడుతున్నది. తెల్లవారుజామున చలి మరింతగా పెరుగుతున్నది. అక్టోబరు 23 రాత్రి హనుమకొండలో 16 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉత్తర దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటంతో ఈ మార్పులు చోటుచేసుకున్నట్టు వాతావరణ నిపుణులు వెల్లడిస్తున్నారు.
హైదరాబాద్లో సాధారణం కన్నా 1.7 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. 24న పలు ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా నమోదయ్యాయి. ఖమ్మంలో పగటిపూట సాధారణం కన్నా 3.8 డిగ్రీలు అధికంగా 35.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం 1.7 హైదరాబాద్లో 1.3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.