హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : స్టార్టప్ సంస్థలకు అడ్డాగా విరాజిల్లుతున్న టీహబ్‌ను రేవంత్ సర్కారు రియల్ ఎస్టేట్ అడ్డాగా మార్చడంపై ఐటీ రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను రూపొందించడం, తెలంగాణను పారిశ్రామికవేత్తల గమ్యస్థానంగా మార్చే లక్ష్యం తో అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆ లోచనల్లోంచి పురుడు పోసుకొని.. ప్ర పంచ దిగ్గజ కంపెనీలను ఆకర్షించడమే గాక సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్, ర తన్ టాటా, ఆనంద్ మహీంద్ర, టిమ్ కు క్లాంటి పారిశ్రామికవేత్తల రాకతో కళకళలాడిన టీహబ్.. నేడు భూముల వేలానికి వేదిక కావడం కాంగ్రెస్ సర్కారు అనాలోచిత చర్యేనంటూ ఐటీ ఉద్యోగులు సైతం మండిపడుతున్నారు.
ఐటీ రంగం అభివృద్ధి చెందాలనే ఉక్కు సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన టీహబ్‌లో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం తప్పుడు సంకేతాలకు దారి తీస్తున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా గురువారం రాయదుర్గం పన్మక్తలో 4,718 గజాల భూమిని ఈ-వేలం వేస్తున్నట్టు టీజీఐఐసీ ప్రకటన ఇచ్చింది.. భూమి అప్సెట్ రిజర్వు ధ రను చదరపు గజానికి రూ.3,10,000గా నిర్ణయించింది. ఈ నెల 22న ఉదయం 11గంటలకు టీహబ్‌లో ప్రీ బిడ్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతున్నది. టీహబ్ వల్లే హైదరాబాద్.. దేశంలోనే స్టార్టప్ క్యాపిటల్‌గా అవతరించింది. అంతటి ప్రత్యేకత ఉన్న టీహబ్ ప్రతిష్టను దెబ్బతీసేలా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు వింత పోకడలు పోతున్నది.